నల్గొండ జిల్లా:నాంపల్లి మండలం రేక్య తండాలో రమావత్ సుధాకర్ ఇంటిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్సై శోభన్ బాబు తన బృందంతో వెళ్లి పది బిల్డర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్స్, ఏడు రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్స్,రెండు ఐబి ఫుల్ బాటిల్స్,5000 బీర్లు నాలుగు,కింగ్ఫిషర్ బీర్లు నాలుగు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలలు మద్యానికి బానిసలు కావద్దనే ఉద్దేశ్యంతో బెల్ట్ షాపులు నడపొద్దని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో బెల్ట్ షాపులపై ఆంక్షలు విధించామన్నారు.
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే బెల్ట్ షాపులు పూర్తిగా నిషేధించామని తెలిపారు.అయినా బెల్ట్ షాపుల ఆగడాలకు హద్దులేకుండా పోతుందన్నారు.
ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.