నల్లగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు,మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజల నుండి వచ్చే వినతులు స్వీకరిస్తూ
వారి సమస్యలు శ్రద్దగా వింటూ పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకి సిఫారసు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అడిషనల్ కలెక్టర్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.