ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై రెండు వారాలైనా సినిమాలో తారక్ కు స్క్రీన్ స్పేస్ విషయంలో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం చల్లారడం లేదు.ఆర్ఆర్ఆర్ మూవీ రెండు వారాల్లో ఏకంగా 1,000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మార్చి 25వ తేదీన రికార్డు స్థాయి స్క్రీన్లలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ వీకెండ్ లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా భారీగానే కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
అయితే తాజాగా ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్ లో బాలీవుడ్ రిపోర్టర్ ఒకరు చరణ్ పాత్రకే సినిమాలో ప్రాధాన్యత ఎక్కువగా ఉందంటూ అడిగిన ప్రశ్న ఇప్పటికే కోపంతో ఉన్న తారక్ అభిమానులకు పుండుపై కారం చల్లినట్టుగా ఉంది.చరణ్ హుందాగానే జవాబు ఇచ్చినా ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ కు మాత్రం ఊహించని స్థాయిలో అన్యాయం జరిగిందని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఆర్ఆర్ఆర్ లో చరణ్ గెలిచాడని ఇద్దరు హీరోల పాత్రలకు న్యాయం చేయడంలో విఫలమై జక్కన్న ఓడిపోయాడని రాజమౌళిని నమ్మి మూడున్నరేళ్ల సమయం కేటాయించి తారక్ మోసపోయాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ పాత్ర విషయంలో తాను హ్యాపీ అని తారక్ చెప్పినా తాము మాత్రం సంతోషంగా లేమని అభిమానులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాలీవుడ్ లో కూడా సత్తా చాటితే మాత్రమే ఆయన అభిమానులు కూల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.అయితే ఆర్ఆర్ఆర్ విషయంలో తారక్ కు అన్యాయం జరిగిందని చెబుతూ అభిమానులే హీరో పరువు తీస్తున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ స్క్రీన్ స్పేస్ విషయంలో తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.







