తెలంగాణ ప్రభుత్వం( Telangana Government ) గత 4 రోజుల నుండి నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం,నల్గొండ జిల్లా జట్ల మధ్యన హోరాహోరి పోరు జరిగింది.రెండు జట్లలో జాతీయస్థాయి క్రీడాకారులు ఉండడం వలన హోరాహోరీ పోరులో నిర్ణీత సమయానికి ఏ జట్టు కూడా స్కోర్ చేయకపోవడం వల్ల పెనాల్టీ షూట్ ఔట్స్ నిర్వహించడం జరిగింది.
పెనాల్టీ షూట్ అవుట్ లో నల్గొండ జిల్లా( Nalgonda ) జట్టు అనుభవ రాహిత్యం వలన కొద్దిగా తడపడంతో ఖమ్మం జిల్లా జట్టు విజయం సాధించగా, నల్లగొండ జిల్లా జట్టు రెండవ స్థానంలో నిలిచిందని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.అనంతరం క్రీడాకారులకు మెడల్స్ బహుకరించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిపి ఫల్గుణ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.