శృంగారం కూడా కాపురంలో ప్రశాంతను, అన్నోన్యతను, ప్రేమని డిసైడ్ చేస్తుంది.మంచి శృంగార జీవితం లేని జంటలు ఎక్కువకాలం ప్రేమలో ఉండటం కష్టం.
అందుకే శృంగార జీవితం, సాఫీగా, సుఖంగా ఉండాలి.అంటే ఇద్దరు శృంగారంలో పాటించే పద్ధతులు, కోరుకునే కోరికలు ఇద్దరికి నచ్చాలి.
అలాగే ఇద్దరికి శృంగారంలో భావప్రాప్తి దొరకాలి.ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.
పురుషులకి భావప్రాప్తి అవడం చాలా సులువు.పైగా బయటకి తెలిసిపోతుంది.
కాని స్త్రీలలో అలా కాదు.భావప్రాప్తి అంత సులువుగా రాదు, బయటకి స్పష్టంగా తెలియదు.
అందుకే చాలామంది స్త్రీలు భావప్రాప్తి కలగకపోయినా కలిగినట్లు నటిస్తారు.భావప్రాప్తి కలిగిందని మగవారిని నమ్మిస్తారు అలా ఎందుకు అంటే.
* సెక్స్ ని మరింత రసవత్తరంగా మార్చడానికి కూడా అమ్మాయిలు భావప్రాప్తిని ఫేక్ చేయొచ్చు.అప్పటికి పురుషుడికి స్కలనం కాకపోతే, భావప్రాప్తి కలిగినట్లు నటించడం ద్వారా తనలోని ఫ్లోని ఇంకా పెంచుతుంది.
ఆ పెరిగిన ఉత్సాహం వలనైనా, తనకు ఈసారి నిజంగా భావప్రాప్తి కలుగుతుందనే ఆశ.
* పురుషుడు పరస్త్రీకి ఎక్కడ అలవాటు పడతాడో అనే భయం కూడా కొందరు స్త్రీలలో ఉంటుంది.పరస్త్రీ వైపు కన్నెతి కూడా చూడకూడదంటే, తమ శృంగార జీవితంలో ఇబ్బందులు ఉండకూడదు.అలాంటప్పుడు తనకు భావప్రాప్తి కలిగినట్లుగా నటిస్తూ, బంధాన్ని కాపాడుకునేందుకు ఆరకంగా ప్రయత్నాలు చేస్తుంది.
* స్త్రీలకి అస్సలు మూడ్ లేదనుకోండి, ఏదో పార్ట్ నర్ కోరిక కాదనలేకే శృంగారం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు సెషన్ ని త్వరగా ముగించాలి అనుకుంటుంది.అందుకే త్వరగా భావప్రాప్తి కలిగినట్లు నటిస్తుంది.
భావప్రాప్తి కలిగిన నటన పూర్తవగానే ఇక తనకు ఓపిక లేదు అని చేతులెత్తేస్తుంది.
* పార్ట్ నర్ తనకోసం బాధపడకూడదు అనే జాలితో కూడా స్త్రీలు భావప్రాప్తి కలిగినట్లు నటించగలరు.
తన భార్యని సుఖపెట్టాలేకపోతున్నాననే బాధతో అతడు కుమిలిపోకూడదని, దాని గురించి పదే పదే ఆలోచిస్తూ డిస్టర్బ్ అవకూడదని ఇలా చేస్తారు అమ్మాయిలు.
* ఇక అతిముఖ్యమైన కారణం, ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగాలు, ప్రేమలో దెబ్బతినకూడదని.
ఇందాక చెప్పినట్లు మంచి శృంగార జీవితం ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది.మరి శృంగార జీవితం సాఫీగా లేనప్పుడు ఏం చేయాలి? ఉన్నట్లు నటించాలి.