నల్లగొండ జిల్లా:(Nalgonda District) గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టి ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా చూడాలని జడ్పీసీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు.సోమవారంనల్లగొండ జిల్లా (Nalgonda District) వేములపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో (MPDO)కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చిన పౌరుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ దరఖాస్తులను స్వీకరించి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
అదేవిధంగా దరఖాస్తుల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేయాలన్నారు.జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో ఆరు గ్రామాల్లో అదేవిధంగా మునిసిపాలిటీ పరిధిలోని ఒక్కో వార్డులో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని డిజిటల్ సర్వేను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
డిజిటల్ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలను సమగ్రంగా తీసుకొని ఆన్లైన్ లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు.కార్యదర్శులు గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులను సమన్వయ పరుచుకుంటూ మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
దసరా వేడుకలు సమీపిస్తున్నందున వీధుల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు.మండలంలో 12 గ్రామపంచాయతీలోని 116 వార్డులో మొత్తం 20,471 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషుల ఓటర్లు 9923 శ్రీ ఓటర్లు 10,540 మంది ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శారదాదేవి,ఎంఈఓ లక్ష్మణ్ నాయక్,డిప్యూటీ తాహసిల్దార్ కోటేశ్వరి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
.