అనేక సంవత్సరాల నుండి మూసి పరిహాక ప్రాంతం విషతుల్యమైందని,దానిని ప్రక్షాళన చేయాలని ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,గత ప్రభుత్వాలు చేస్తామని తూతూ మంత్రంగా చేసి పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ యాదాద్రి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు(Goda Sri Ramulu) అన్నారు.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో శ్రీ మత్యాద్రి ఫంక్షన్ హాల్ లో యాస జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వలిగొండ మండల సిపిఐ కౌన్సిల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదేనని,అదేవిధంగా ఈ జిల్లాలో గంధమల్ల రిజర్వాయర్,బస్వాపురం ద్వార ఈ ప్రాంతాలకు తాగు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.
బూనాది గాని, భీమలింగం(Either Boonadi , Bhimalingam) కాల్వలను కూడా నిధులను వెంటనే విడుదల చేసి పూర్తి చేయాలన్నారు.ఈ మండలంలో అనేక గ్రామాలకు బిటి రోడ్లు నిర్మాణం చేయవలసి ఉన్నదని,వెంటనే వాటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యుడు బోడ సుదర్శన్,సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య,సలిగంజి వీరస్వామి,ఎల్లంకి మహేష్, సల్వాద్రి రవీందర్, పులిపలుపుల మల్లేష్, బాలగోని సత్యనారాయ







