యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District,): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే(Hanumantu K.
Jendage) జిల్లా అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 39 దరఖాస్తులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్(K.Gangadhar),జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్(P.Ben Shalom),జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి,కలెక్టరేట్ పరిపాలనాధికారి జగన్మోహన్ ప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.