ఎస్వీఆర్.తెలుగు సినిమా పరిశ్రమలో ఓ దిగ్గజ నటుడు.నిండైన రూపంతో తెలుగు తెరపై గంభీర్యాన్ని ప్రదర్శించే వాడు.ఆయన తెరమీద కనిపిస్తే నవరసాలు ఒలికిపోయేవి.ఆయన నటన ముందు స్టార్ హీరోలంతా దిగదుడుపే అనిపించేవారు.ఆయన ముఖం చిట్లిస్తే మహా నటులు సైతం వణికిపోయేవారు.
ఆయన నటనా దర్పం ముందు పేరు మోసిన విలన్లు కూడా భయపడేవారు.ఎస్వీఆర్ తెరమీద కనిపిస్తే చాలు జనాలు ఈలలు వేసి గోల చేసేవారు.
ఆయన తెరమీద నటిస్తుంటే జనాలు మైమరి చూసేవారు.
ఎస్వీఆర్.
మాట పెదవి దాటక ముందే ముఖంలో ఆయన చెప్పాలి అనుకునే భావం కనిపించేది.ఆయన నటనకు జనాలు అందకే దాసోహం అయ్యేవారు.
పౌరాణిక, జానపద చిత్రాల్లో తను పోషించిన పాత్రలు చూసి జనాలు అబ్బుర పడేవారు.ఘటోత్కచుడు, రావణుడు, కీచకుడు, నేపాళ మాంత్రికుడు, హిరణ్య కశిపుడు, తాతయ్య, తండ్రి, మామయ్య ఒకటేమిటీ ఏ పాత్ర అయినా అవలోకగా చేసేవాడు.
తన జీవితాంతం అద్భుత నటుడుగా కొనసాగాడు.నటిస్తూనే చనిపోయాడు.
ఎస్వీఆర్ కు నటన అంటే ప్రాణం.చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలనే కుతూహలం ఉండేది.ఎస్వీఆర్ నాన్నమ్మ తనను పెద్ద చదువులు చదివించాలని మద్రాసులో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని స్కూల్లో జాయిన్ చేసింది.
అయితే ఎస్వీఆర్ కు చదువు మీద కంటే సినిమాల మీదే శ్రద్ధ ఎక్కుగా ఉండేది.అందుకే ప్రతిరోజు ఇంట్లో చెప్పకుండా సెకెండ్ షోకు వెళ్లేవాడు.ఇందుకోసం తన నాన్నమ్మ లోపలి గదిలో పడుకుంటే.
తను ముందు గదిలో పడుకునేవాడు.వాళ్ల నాన్మమ్మ నిద్రపోగానే సినిమాకు వెళ్లేవాడు.
ఓ రోజు కరెంటు పోయింది.ఆ సమయంలో ఎస్వీఆర్ ను నిద్రలేపాలని వెళ్లింది నాన్నమ్మ.
కానీ తన పక్కలో ఎస్వఆర్ లేడు.దిండ్లు ఉన్నాయి.
దీంతో ఆమెకు ఎంతో కోపం వచ్చింది.ఎస్వీఆర్ వచ్చే వరకు మెలుకువతోనే ఉండి రాగానే సన్నటి బరిగెతో నాలుగు దెబ్బలు వేసింది.
ఆ తర్వాత తనే బాధపడింది.దెబ్బలకు వెన్న రాసింది.
నాన్నమ్మ ప్రేమకు ముగ్ధుడు అయ్యాడు ఎస్వీఆర్.