మైనారిటీ మేలుకో నీ హక్కులు తెలుసుకో...!

నల్లగొండ జిల్లా: నల్లగొండ రాజకీయాలను దిశానిర్దేశం చేసే సత్తా ముస్లిం మైనారిటీలకు ఉన్నదని యునైటెడ్ ముస్లిం మైనారిటీ హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ తాజుద్దీన్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మైనారిటీ మేలుకో నీ హక్కులు తెలుసుకో పేరుతో వల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

 Muslim Minority Leaders Meeting In Nalgonda Constituency, Muslim Minority Leader-TeluguStop.com

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ముస్లిం మైనార్టీల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని,ద్వితీయ శ్రేణి పౌరులుగా ద్వంద వైఖరి అభిలంబిస్తూ,ముస్లిం సమాజాన్ని అభివృద్ధి పరచక కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని అన్నారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ ముస్లింలకు న్యాయం జరగాలంటే ఎప్పుడైతే వారికి రాజకీయాలలో వాటా లభిస్తుందో అప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలో రాజకీయాలను దిశానిర్దేశం చేసే సత్తా మా మైనార్టీ ప్రజలకు ఉన్నదన్నారు.మైనార్టీల ప్రజల ఓట్లతోనే గెలిచిన నాయకులు ఉన్నారని,గెలిచిన తర్వాత కనీసం మా వాడల్లోకి రాని నాయకులను మా సమస్యలను గాలికి వదిలేసిన నాయకులను మేము ఎందుకు గెలిపించాలన్నారు.

బలమైన మైనార్టీ ప్రజల ఓట్లు ఉన్నచోట కనీసం మా నాయకుల విగ్రహం లేకపోవడం చాలా బాధాకరమన్నారు.మా డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇచ్చిన వారికి తమ మద్దతు ఉంటుందని, లేనిచో తమ సంస్థ నుండే ఒక అభ్యర్థిని బరిలోకి దింపుతామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జావిద్ అలీ, జనరల్ సెక్రెటరీ షేక్ సద్దాం,జిల్లా జాయింట్ సెక్రటరీ బషిరుద్దీన్, గయాజ్,సంస్థ పట్టణ కమిటీ సభ్యులు అబ్దుల్ మజీద్,ఎండి యూనుస్, జలీల్,నయీం,అజ్మత్, నూర్ భాషా,జిల్లా కమిటీ మెంబర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube