రాష్ట్ర ప్రజల కోసం ప్రగతి కోసం టీడీపీ ఆశీర్వదించండి

రాష్ట్ర ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని టీడీపీ రాష్ట్ర పరిశీలకులు తళ్లూరు జీవన్ కుమార్ కోరారు.మంగళవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురంలో నియోజకవర్గ ఇంచార్జి జక్కలి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు అధ్యక్షులు కుందారపు కృష్ణమాచారి తో కలిసి పాల్గొన్నారు.

 Bless Tdp For Progress For The People Of The State-TeluguStop.com

ముందుగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిఅనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించి, ర్యాలీ నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని స్థాపించి పేద ప్రజల కోసం వృద్ధాప్య పెన్షన్ పక్కా ఇండ్ల నిర్మాణం,ఉచిత విద్యుత్, రెండు రూపాయల కిలో బియ్యంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశంలోనే మొదటిసారిగా అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని కొనియాడారు.

సంక్షేమ కార్యక్రమాలతో పాటు పల్లెలను అభివృద్ధి బాటలో నడిచేందుకు నాటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్,చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని తెలిపారు.

బీసీలు మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చైతన్య కావడం కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించి ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.నాడు టీడీపీ వేసిన బీజంతోనే నేడు రాష్ట్రంలో సంపద పెరిగిందని కొత్తగా కెసిఆర్ రాష్ట్రం కోసం చేసింది శూన్యమన్నారు.

ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ పుర్య వైభవం రావడం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.టిఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు ప్రజలు అణిచివేత గురవుతున్నారని, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ఉండటానికి భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు.

మండల పార్టీ అధ్యక్షులు కన్వీనర్ ఏర్పుల్ సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి మక్కన అప్పారావు, నాయకులు ఎర్రజల్ల లింగయ్య,అవ్వారి సుబ్బారావు,ఎండీ షరీఫ్, కొలను వేణుగోపాల్ రెడ్డి, నెట్టు శ్రీకాంత్,ముత్యాల విజయ్ కుమార్,పాషా తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube