ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా తమ ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోవాలని అనుకుంటూ ఉంటారు.అయితే ముఖ్యంగా ఆడవాళ్లు తమ ముఖం మెరిసిపోవాలని ఎక్కువగా కోరుకుంటారు.
ప్రతిరోజు మనం ఉపయోగించే ఆహారాలలో పెరుగు( Curd ) ఒకటి.అయితే మనం పెరుగును రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం.
పెరుగులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి.అయితే ఇది చర్మాన్ని కాంతివంతంగా మారిచ్చేందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అయితే పెరుగు లో ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మాన్ని మృదువుగా( Soft Skin ) ఉండేలా చేస్తుంది.అలాగే చర్మం పై గీతలు, ముడతలు, రంధ్రాలని తొలగించడంలో కూడా పెరుగు బాగా సహాయపడుతుంది.
![Telugu Besan, Curd, Curd Face, Skin, Face Problems, Honey, Lemon, Pimples, Shiny Telugu Besan, Curd, Curd Face, Skin, Face Problems, Honey, Lemon, Pimples, Shiny](https://telugustop.com/wp-content/uploads/2023/12/curd-face-packs-remove-all-your-face-problems-detailsa.jpg)
ఇక పెరుగులో ఉండే రిబోఫ్లేవిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.కణాల పెరుగుదల అలాగే పునరుత్పత్తికి కూడా ఇది సహాయపడుతుంది.అయితే ముందుగా ఒక బౌల్ లో ఒక స్పూన్ పెరుగు, అర స్పూన్ తేనె,( Honey ) అర స్పూన్ నిమ్మరసం( Lemon ) వేసి బాగా కలుపుకోవాలి.ఇక ఈ మిశ్రమాన్ని ముఖానికి, అలాగే మేడకు బాగా రాసి అరగంట అయ్యాక ఆ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వలన మొటిమలు మచ్చలు తొలగిపోవడంతో పాటు ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది.అలాగే చర్మం పై మృత కణాలు కూడా తొలగిపోతాయి.
![Telugu Besan, Curd, Curd Face, Skin, Face Problems, Honey, Lemon, Pimples, Shiny Telugu Besan, Curd, Curd Face, Skin, Face Problems, Honey, Lemon, Pimples, Shiny](https://telugustop.com/wp-content/uploads/2023/12/curd-face-packs-remove-all-your-face-problems-detailss.jpg)
చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ శనగపిండి( Besan Flour ) వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి.ఇక పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికోసారి వేసుకోవడం వలన చర్మం సున్నితంగా మారడంతో పాటు మొటిమలు వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తగ్గిపోతాయి.
తర్వాత టేబుల్ స్పూన్ పెరుగులో పావు టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.ఇలా పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ప్రకాశమంతంగా మారుతుంది.
పసుపులో ఉన్న యాంటీసెప్టిక్ గుణాలు మొటిమలు రాకుండా కాపాడుతాయి.అలాగే వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల ఎన్నో చర్మ ప్రయోజనాలు పొందవచ్చు.