తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఇక ఈయన పుష్ప సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నప్పటికీ తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ సినిమాతో తనకు తాను స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన చేస్తున్న పుష్ప 2( Pushpa 2 ) సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఫాహాద్ ఫజిల్.
ఇక మొదటి పార్ట్ చివర్లో వచ్చిన ఈయన సెకండ్ పార్ట్ లో మాత్రం మొత్తం తన గురించే సినిమా ఉండబోతుంది అన్నట్టుగా మొదట్లో ఆయన క్యారెక్టర్ ను చిత్రీకరించారు.కానీ ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ను సుకుమార్ పెద్దగా పట్టించుకోవట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి.
మరి ఆయన క్యారెక్టర్ సినిమాలో ఉంటుంది.కానీ ఆయన క్యారెక్టర్ కి పెద్దగా గుర్తింపు అయితే ఉండదు అని మరి కొంత మంది చెప్తున్నారు.
ఇక దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఫాహాద్ ఫజిల్ క్యారెక్టర్ కి పెద్దగా గుర్తింపు అయితే లేదట.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఫహాద్ ఫజిల్( Fahadh Faasil ) ఈ సినిమాతో మంచి గుర్తింపు ను సంపాదించుకుంటాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక నిజానికి ఒక క్యారెక్టర్ లో డెప్త్ ఉంటేనే ఫహద్ ఫజిల్ ఆ క్యారెక్టర్ ని చేయడానికి ముందుకు వస్తాడు.కానీ పుష్ప 2 సినిమాలో ఆయనకు చేదు అనుభవం ఎదురవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక పుష్ప 2 సినిమాలో దాక్షాయని, మంగళం శ్రీను లా క్యారెక్టర్లతో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా రాబోతున్నాయట.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కానీ ఈ సినిమా తో ఎవరికి ఎక్కువ గుర్తింపు వస్తుంది అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…