తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) మంగళవారం తిరుమలకు చేరుకున్నారు.కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధిలో మనవడి మొక్కు తీర్చుకునేందుకు హైదరాబాదు బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకి కుటుంబ సమేతంగా చేరుకున్నారు.

 Cm Revanth Reddy Reached Tirumala Cm Revanth Reddy, Tirumala ,revanth Reddy , B-TeluguStop.com

ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరారు.రచన అతిథి గృహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ( TTD EO Dharma Reddy )స్వాగతం పలికారు.

రేపు విఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని రేవంత్ రెడ్డి కుటుంబం దర్శించుకోనున్నారు.ఇదే క్రమంలో మనవడి పుట్టెంటుకులు సమర్పించనున్నారు.

మంగళవారం రాత్రికి తిరుపతిలోనే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు బస చేయనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా తిరుమల చేరుకోవటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.

మంగళవారం హైదరాబాద్ లో బషీరాబాగ్ పరిశ్రమల భవన్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు పనులలో పురోగతిని అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఇదే సమయంలో వివిధ రంగాలకు సంబంధించి ఆరు నూతన పాలసీలు తయారు చేస్తున్నట్లు అధికారులకు సీఎం తెలిపారు.ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఈవీ పాలసీలకు.

సవరణ చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశం అనంతరం.

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో ప్రత్యేక విమానంలో తిరుమల చేరుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube