సస్పెండ్ అయిన సీఈవోకే చార్జ్ ఇచ్చిన చైర్మన్?

నల్లగొండ జిల్లా:అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్ కి గురైన నిడమనూరు మండలం వెనిగండ్ల పిఎసిఎస్ సొసైటీ సీఈవో జివి రాఘవరావు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయకుండా, పిఎసిఎస్ సొసైటీ పాలకవర్గం తీర్మానం లేకుండానే, కేవలం సొసైటీ చైర్మన్ అనుమతితో తిరిగి అదే సొసైటీలో సీఈవోగా బాధ్యత స్వీకరించడం ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.గురువారం వెనిగండ్ల పిఎసిఎస్ పాలకవర్గ సమావేశం పేరుతో సభ్యులు కానివారితో మహాజనసభ నిర్వహించి,ఈ సమావేశంలో సస్పెండ్ అయిన సొసైటీ సీఈవో జి.

 The Chairman Who Gave Charge To The Suspended Ceo?-TeluguStop.com

వి.రాఘవరావును సోసైటిలో మళ్లీ సీఈవోగా నియమించినట్లు సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.దానికీ పాలకవర్గం కూడా మద్దతు ఇవ్వాలని చైర్మన్ పాలకవర్గాన్ని వత్తిడి చేయడంతో పాలకవర్గ సభ్యులు ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు.సస్పెండైన సీఈవోను ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా,ఈ సోసైటీలో మళ్లీ సీఈవోగా నియామకం చేయడం చట్ట విరుద్ధమన్నారు.

అతనిని నియామకం కాకుండా నిలిపివేయాలని,అదే విధంగా రెండు ఏళ్ల క్రితం గోడౌన్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సొసైటీ చైర్మన్ పై కూడా విచారణ జరిపించాలని సొసైటీ సభ్యులు డిసిఓకి వినతిపత్రం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube