సబ్ స్టేషన్ పక్కనే ఒరిగిన విద్యుత్ స్తంభం

నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రం తుమ్మలపల్లి రోడ్డులోని డాన్ బాస్కో కళాశాల,విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన విద్యుత్ స్తంభం పూర్తిగా ఒకవైపు ఒరిగి ఉండడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం ఈదురు గాలులు భీభత్సం సృష్టిస్తున్న తరుణంలో ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ఆకాశం ఉంటుందని వాపోతున్నారు.

 Downed Power Pole Next To Sub Station, Downed Power Pole , Sub Station, Power Po-TeluguStop.com

వ్యవసాయ భూముల నుండి వెళ్లిన 11కే.వీ విద్యుత్ స్తంభం పక్కకు ఒరగడంతో రైతులకు కూడా ప్రమాదమని,పంట చేలల్లో ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

సబ్ స్టేషన్ పక్కనే ఉన్నా విద్యుత్ అధికారులకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని, చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తక్షణమే ఒరిగిన విద్యుత్ స్తంభం విరగక ముందే మార్చాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube