నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక ఆఖరి రోజు ప్రచారంలో భాగంగా ఈటెల రాజేందర్ తన సతీమణి జమున కలిసి వారి అత్త గారి ఊరు అయినా పలివెల గ్రామంలో ప్రచారానికి వెళ్లారు.వారు ప్రచారం చేస్తున్న సమయంలో అదే ఊరుకి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న ఏంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి,నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుధర్శన్ రెడ్డి,ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ జగదీష్,వారి అనుచరులు బీజేపీ నాయకులపై కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడి,వారిపై తీవ్రంగా రాళ్లతో దాడికి దిగడం పిరికి చర్యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
దాడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటెల వ్యక్తి గత సిబ్బంది,గన్ మెన్, కార్యకర్తలు చాలామంది తీవ్రంగా గాయపడ్డారని,వాహనాల,కార్ల అద్దాలను పగలగొట్టారని,గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ పైన కక్ష సాధింపు జరుగుతుందని,సెల్ ఫోన్లు కూడా ట్యాప్ చేసి ప్రైవేట్ లైఫ్ లేకుండా అన్ని వినడం హెయమైన చర్య అన్నారు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు ఇతర జిల్లా నుండి వచ్చిన నేతలు పక్కా ప్లాన్ తో ఈటల రాజేందర్ పై దాడికి దిగారని,పోలీసులు వద్దని చెప్పినా వినకుండా టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగారన్నారు.పలివెల గ్రామంలో ఓట్లు రావని,మునుగోడులో ఓటమి భయంతో దాడులకు దిగుతున్నారన్నారు.
బస్తాల్లో రాళ్లు నింపుకుని మరి గులాబీ శ్రేణులు తిరుగుతున్నారని అన్నారు.దాడి జరిగాక గ్రామంలోని ప్రజలకు ఇబ్బంది కాకూడదని ఈటెల సంయమనం పాటించాడన్నారు.
కర్రలు,రాళ్లతో ఎందుకు తిరుగుతున్నారు, గతంలో మీటింగ్ అడ్డుకున్నారు,ఈరోజు రాళ్ల దాడి చేశారు, ఈ సందర్బంగా డీజీపీకి హెచ్చరిస్తున్న దాడి చేసినవాళ్లను వెంటనే అరెస్ట్ చేయాలనని డిమాండ్ చేశారు.దాడులకు భయపడం ప్రాణాలు పోయిన మేము భయపడమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని,నియోజకవర్గంలో ఏర్పరిచిన చెక్ పోస్ట్ ల వద్ద బీజేపీ నేతల కార్లు తనిఖీలు చేస్తున్నారు కానీ,టీఆర్ఎస్ వాహనాలు తనిఖీలు ఎందుకు చెయ్యట్లేదన్నారు,బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఈటలపై కుట్ర జరుగుతుందని,తప్పకుండా 3 వ తేదీ కెసిఆర్ కి,టీఆర్ఎస్ కి తగిన బుద్ది మునుగోడు ప్రజలు చెబుతారన్నారు.ఈటల మొహం చూడొద్దని అక్కడ అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు.
అసెంబ్లీలో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో లేదని,ఈటల పట్ల టీఆర్ఎస్ కక్ష పూరితంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు,టిఆర్ఎస్ ఎన్ని కుట్రలు,దాడులు చేసినా మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈటెల మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా మా సతీమణి పుట్టిన పలివేల గ్రామానికి వెళ్లి ఆడపడుచులను ఒక ఆడబిడ్డగా కలిసే క్రమంలో,ఎక్కడ బీజేపీకి ఆదరణ వచ్చి టిఆర్ఎస్ ఆదరణ పొతుందోనని ఈ దాడికి పాల్పడ్డారన్నారు.
కావాలనే కుట్ర పన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాళ్లు కర్రలతో దాడులకు పాల్పడ్డారన్నారు.అక్కడ మహిళలు,గ్రామస్థులు ఉన్నారన్న ఆలోచనతో మేము సంయమనంగా ఉన్నామని తెలిపారు.
ప్రజా క్షేత్రంలోనే సీఎం కేసీఆర్ కి బుద్ధి చెప్తామన్నారు.నా గన్ మాన్ కి వాళ్ళు విసిరిన రాళ్లు తగిలి గాయాలైనవని, అయినా కూడా అక్కడ ప్రజలకి ఇబ్బంది అవ్వకూడదని ఫైర్ ఓపెన్ చేయవద్దని చెప్పిన అన్నారు,ఈ టిఆర్ఎస్ పార్టీ పాలనలో పార్టీలు నిజాయితీగా బతికే రోజులు పోయినవని,సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రంలో పలుకుబడి కోల్పోవడంతో అసహనంతో ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నరన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసే వరకు నేను నా భార్య పోరాడుతం అన్నారు.పలివేల గ్రామంలో రక్తపాతానికి ప్రజలే బుద్ధి చెప్తారని,ఇలాంటి రాక్షస పాలనపై ప్రజలు మునుగోడు గెలుపుతో నీకు బుద్ది చెప్పడం కాయమన్నారు.