ఇంకో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది:ఎంపీ కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:ఇంకో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే పంచాయతీ కార్మికుల జీతం పెంచుతామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో గ్రామ పంచయతీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె 31వ రోజుకు చేరుకున్న సందర్భంగా వేతనాల పెంపు,పర్మినెంట్ సహా పలు డిమాండ్లతో తెలంగాణ గ్రామ పంచయతీ ఉద్యోగ,కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు.

 Congress Government Will Come In Three Months:komatireddy Venkat Reddy   , Congr-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని,కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కష్టపడ్డారని,నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కనీస వేతనం అమలు చేయాలని కోర్టులు చెప్పినా కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఇది చాలా బాధాకరమన్నారు.

గతంలో ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో కలిపేది లేదన్న కేసీఆర్( CM KCR ),ఇప్పుడు విలీనం చేస్తున్నారని, ఆయనకు ఓటమి భయం ఎక్కువైందని,అందుకే ఇలా చేస్తున్నారన్నారు.కేసీఆర్ కు ఆయన కొడుకు,కూతురు బాగుంటే చాలని,రాష్ట్రం ఏమైనా పట్టదని విమర్శించారు.

మీది న్యాయమైన కోరికని, మీకు న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.బంధుల పేరుతో కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని,బీఆర్ఎస్ బంద్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయని,ఎన్నికలు ఉన్నాయనే కేసీఆర్ కు అన్ని బంధులు గుర్తుకొస్తున్నాయన్నారు.

ఎన్నికలు వస్తాయా అని కార్మికులు ఎదురు చూస్తున్నారని,ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube