దేశంలో రెండవ అతిపెద్ద నగరంగా హైదరాబాద్:కేటీఆర్

నల్గొండ జిల్లా:భారత దేశంలో శరవేగంగా అభివృద్ధి అవుతున్న మహా నగరం మన హైదరాబాద్ అని, మరి కొద్దిరోజుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో అతి పెద్ద నగరంగా అవతరిస్తుందని,ఇది మనందరికి గర్వకారణమని మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.శనివారం నల్గొండ జిల్లా పెద్దవుర మండలం సుంకిషాల వద్ద హైదరాబాద్ తాగు నీటి అవసరాలను తీర్చేందుకు శాశ్వత పరిష్కారంగా,జలమండలి నిర్మిస్తున్న భారీ ఇన్ టెక్ వెల్,పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రులు జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ,సబితా ఇంద్రారెడ్డి,శ్రీనివాస్ గౌడ్,మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

 Hyderabad Is The Second Largest City In The Country: Ktr-TeluguStop.com

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రకృతి పరంగా మన హైదరాబాద్ కు ఎన్నో గొప్ప వనరులు,గొప్ప అనుకులతలు ఉన్నాయన్నారు.దేశ వ్యాప్తంగా మంచి నీటికి కటకట ఉన్నదని,మరి కొన్ని నగరాలు సకల అసౌర్యలతో సతమతం అవుతున్నాయని,కానీ,హైదరాబాద్ నగరానికి అన్ని అనుకూలతలు ఉన్నాయని,గొప్ప దార్శనీయత గల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు.హైదరాబాద్ కి రూ.1450 కోట్లతో అదనంగా పదహరున్న టి.ఎం.సి ల నీటిని పంపింగ్ చేసేలా ఈ ఇన్ టెక్ వెల్ ను నిర్మిస్తున్నామని, మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేసేలా కూడా సివిల్ వర్క్స్ జరుగుతున్నాయని అన్నారు.మా అంచనా రాబోయే ఎండాకాలం వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని,ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా ఈ పంపింగ్ స్టేషన్ ను నిర్మిస్తున్నామని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారని,ఇది ఓ రికార్డు, ఓ అద్భుతమైన ప్రాజెక్టు,ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పదనమని పేర్కొన్నారు.

ఇది భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని,కాళేశ్వరం చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని, వరుసగా ఏడేళ్లుగా కరువు వచ్చినా తాగు నీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి ఏ ఆలోచన అయినా గొప్పగా ఉంటుందని,హైదరాబాద్ చుట్టున్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా కూడా వాటర్ పైప్ లైన్ లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులా,బయటున్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేసామని,2072 వరకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో ప్లాన్ చేసారని పేర్కొన్నారు.ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,జిల్లాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమని,మానసిక ప్రశాంతత కోసం సాగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ బుద్ధవనం ఏర్పాటు చేశారని,ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు పవిత్ర భూమి బుద్ధవనమని,బుద్ధవనం పర్యటన స్వర్గధామం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు నోముల భగత్,నల్లమోతు భాస్కర్ రావు,రవీంద్ర కుమార్,చిరుమర్తి లింగయ్య,కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసి కోటిరెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube