నల్లగొండ జిల్లా:ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయానికి వరద భారీగా వస్తుండడంతో ప్రాజెక్ట్ అధికారులు నేడు 20 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు ఉంది.పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టిఎంసిలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది.ఇన్ ఫ్లో 2,10,405 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,10,405 క్యూసెకులుగా ఉంది.