యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తల్లి ఒంటరిగా ఎందుకు జీవిస్తుంది ..?

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్లు గా ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబులను పిలిచేవాళ్ళు.అయితే వీళ్ల తర్వాత అగ్రహీరోగా వెలుగొందిన ఇంకో హీరో ఎవరు అంటే రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి పేరు చెప్పాలి.

 Tollywood Hero Prabhas Mother Whereabouts, Prabhas,  Krishnam Raju, Prabhas Moth-TeluguStop.com

ఆయన భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు.ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ , శోభన్ బాబు దగ్గర్నుంచి ఎంత పోటీ ఎదురైనా తనకంటూ మంచి గుర్తింపు సాధించుకుంటూ మాస్ లో తనను మించిన హీరో లేడు అన్నట్టుగా చాలా సినిమాల్లో మాస్ క్యారెక్టర్ లు చేసి చూపించాడు.

కృష్ణం రాజు గారిని చూస్తే హీరో అంటే ఇలాగే ఆరడుగులు ఉండాలి అనిపించేది.

కృష్ణం రాజు గారికి కొడుకులు లేరు ఇద్దరు కూతురులే అందరి హీరోల ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వాళ్ల కొడుకులు వస్తున్నారు మన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా ఒకరు రావాలి మన నట ప్రస్థానం ఇంతటితో ఆగిపోకూడదు అనుకుని తన తమ్ముడు అయిన సూర్యనారాయణ రాజు కొడుకైనా ప్రభాస్ ని సినిమాల్లోకి తీసుకు వచ్చారు.

ప్రభాస్ కి మొదట్లో సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు కానీ పెదనాన్న కృష్ణం రాజు గారు బలవంతం చేయడంతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చారు.మొదటి సినిమా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ అనే చిత్రంతో పరిచయం అయ్యాడు.

ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ప్రభాస్ కి హీరోగా మంచి మార్కులు పడ్డాయి.తర్వాత వచ్చిన వర్షం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు ఇండస్ట్రీకి మంచి మాస్ హీరో దొరికాడు అని అందరూ అనుకున్నారు.

Telugu Bahubali, Chatrapathi, Krishnam Raju, Prabahs, Prabhas Mother-Telugu Stop

ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో ఇండస్ట్రీలో మాస్ హీరో అంటే ప్రభాస్ లానే ఉండాలి అనే అంతగా జనాల్ని మాయ చేసాడు.ఆ తర్వాత చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు ప్రభాస్.అపజయ మెరుగని దర్శకధీరుడు అయినా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు.తెలుగులోనే కాదు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అయిపోయాడు ప్రభాస్.

యాక్టింగ్ ఏ ఇంట్రెస్ట్ లేదు అన్న ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు.అయితే ప్రభాస్ వాళ్ల అన్న ప్రమోదు తో యువి క్రియేషన్స్ అనే బ్యానర్ ని స్థాపించి దాంట్లో సినిమాలు చేస్తున్నారు.

కృష్ణం రాజు గారు కూడా హీరోగా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు సూర్యనారాయణ రాజు కూడా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి కృష్ణంరాజు తో చాలా చిత్రాలు నిర్మించాడు.

అయితే ప్రభాస్ వాళ్ళ నాన్న కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రభాస్ వాళ్ళ అమ్మ కొన్ని రోజుల పాటు అనారోగ్యానికి గురై కోలుకోలేదు దాంతో అమ్మని పెదనాన్న కృష్ణం రాజు వాళ్ళ ఇంట్లో ఉంచాడు.కొద్దిరోజుల తర్వాత ప్రభాస్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం కుదుట పడడంతో ప్రభాస్ ఇంటికి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు.

కృష్ణం రాజు కూడా ఫ్యామిలీస్ విడిగా ఉండడం ఎందుకని పక్కపక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం సినిమాలో నటిస్తున్నాడు.దాంతోపాటు కే జి ఎఫ్ డైరెక్టర్ ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో లో సాలార్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు ఈ సినిమాలో మొదటిసారి ప్రభాస్ శృతిహాసన్ తో జతకడుతున్నాడు.ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు తెలుగు హీరో ఇంటర్నేషనల్ హీరోగా మారినందుకు తెలుగు వాళ్ళమైన మనం అందరం గర్వించాలి… ప్రభాస్ తన పెదనాన్న అయినా కృష్ణంరాజుతో కలిసి బిల్లా సినిమాలో నటించారు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

అలాగే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన రెబల్ చిత్రంలో కూడా కృష్ణం రాజు గారు ప్రభాస్ ఇద్దరు కలిసి నటించారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube