ఆడపిల్ల పుట్టిందని తండ్రి,నాయనమ్మపైశాచికత్వం

నల్లగొండ జిల్లా: మూడో కాన్పులో సైతం ఆడపిల్ల పుట్టిందని తమ ఊర్లోకి వెళితే పరువు పోతుందని భావించిన కన్నతండ్రి,నాయనమ్మ ఈ ఆడపిల్ల మాకొద్దంటూ, అప్పుడే పుట్టిన అభంశుభం తెలియని పసి గుడ్డును శిశు గృహానికి అప్పగిస్తామని ఏకంగా ఐసిడిఎస్ అధికారులకు ఫోన్ చేసి శిశువుని తీసుకెళ్ళమని చెప్పిన విషయం నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామానికి చెందిన కేతావత్ బాలు భార్య శివనందిని మూడో కాన్పు కోసం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది.

 The Father And Grandmother That The Girl Was Born Are Satanic-TeluguStop.com

ఆమెకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా,శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో ఆసుపత్రిలో మూడో కాన్పులో సైతం మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది.శిశువు పుట్టిన గంటలోపే తనకు ఈ ఆడపిల్ల వద్దని పట్టుపట్టారు శిశువు తండ్రి,నాయనమ్మ.

ఎంతకూ మాట వినక పోవడంతో ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ఏఎన్ఎం ఐసిడిఎస్ డిండి సూపర్వైజర్ రేణుకకు రాత్రి ఒంటిగంట సమయంలో సమాచారం ఇచ్చింది.వెంటనే ఆస్పత్రికి చేరుకున్న సూపర్వైజర్ పోలీసులకు,గ్రామ సర్పంచ్ కి ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో వెంటనే స్పందించిన వారు ఆసుపత్రికి చేరుకొని శివువు తండ్రి, నాయనమ్మకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఆడపిల్లను వదిలించుకోవాలని చూడొద్దని,ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని బాలికను తీర్చిదిద్దాలని నచ్చజెప్పారు.అయినా ససేమిరా అనడంతో గ్రామ సర్పంచ్ లక్ష్మి శిశువు పేరిట 30 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు,నాయనమ్మ శిశువును పెంచుకుంటానికి ఒప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube