నల్గొండ జిల్లా:సరదాగా తండ్రితో కలిసి ట్రాక్టర్ పై వెళ్లిన బాలుడు ట్రాక్టర్ రూట్ వేటర్ సందులో పడి మృత్యువాత పడ్డ విషాద ఘటన నల్లగొండ జిల్లాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చండూర్ మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వర్కాల రవి తన సొంతం ట్రాక్టర్ పై తన కొడుకు వర్కాల కార్తీక్(15) వెంటబెట్టుకుని అదే గ్రామానికి చెందిన జక్కల లింగయ్య కౌలు భూమిని దున్నడానికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెళ్ళాడు.
భూమి దున్నుతుండుగా ట్రాక్టర్ వెనకాల రూట్ వేటర్ పై(నాగండ్లపై) కార్తీక్ కూర్చున్నాడు.ఇదే క్రమంలో రవి ట్రాక్టర్ ను అజాగ్రత్తగా నడపడంతో కార్తీక్ టాక్టర్ నాగండ్ల సందులో ఇరుక్కొని ముద్దలా నుజ్జు నుజ్జుగా మారాడు.
అప్పటికే మరణించాడని గ్రహించిన తండ్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ఘటనపై రవి అన్న వర్కాల యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.