వికీపీడియా అంటే ఏమిటో తెలియని జనాలు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.మనకి ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సమాచారం కావాలంటే అందరూ మొదటగా సందర్శించేది వికిపీడియానే.
ఎందుకంటే ఇందులో ప్రతి అంశానికి సంబంధించిన డేటా అప్‌డేట్ చేస్తుంటారు.అయితే ఈ వికిపీడియా అనేది ఉచితంగా అందించే సర్వీసు అని చాలా కొద్దిమందికి తెలుసు.
చాలామంది వికీపీడియా వారు చాలా మనం చదవడం వలన చాలా సంపాదించేస్తారు అని గుడ్డిగా అనుకుంటారు.కానీ అది నిజం కాదు.
వికీపీడియాలో మీలాంటి మాలాంటి సాధారణ ప్రజలు కూడా ఆర్టికల్స్ రాయొచ్చు.
అయితే ఇలా ఫ్రీ సర్వీస్ ఇవ్వడం వలన వికీపీడియా ఇపుడు ఫండ్స్ లేక ఇబ్బందులో ఉందనే చెప్పుకోవాలి.
అందుకే వారు అప్పుడప్పుడు తమ వికీపీడియా పేజిపైన డొనేషన్లు కావాలని యూజర్స్ ని అడుగుతూ వుంటారు.కానీ 98% మంది ప్రజలు సింగల్ పెన్నీ కూడా డొనేట్ చేయకుండానే ఇప్పటివరకు వికీపీడియాని వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో వికీపీడియావారు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు.దాంతో మరలా తాజాగా వారు డొనేషన్లు కోరుతున్నారు.కాబట్టి ఎవరన్నా యూజర్లు మంచిమనసు చేసుకొని మినిమమ్ 50/- చెల్లించాల్సిందిగా ఈ వేదికగా కోరుతున్నాము.
దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.
1.మొదటగా వికీపీడియా పేజీకి వెళ్ళండి.అది ఎలాగో అని కంగారు పడొద్దు.
2.ఏదన్నా టాపిక్ ఎంచుకొని దానిపక్కనే వికీపీడియా అని టైపు చేయండి.దానితరువాత మనకి కొన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి.

3.అందులో సదరు టాపిక్ కి సంబంధించిన వికీపీడియా ఒకటి ఉంటుంది.ఇపుడు దానిపైన క్లిక్ చేయండి.
4.ఇపుడు మీరు వికీపీడియాకి విజయవంతంగా వెళ్లారు.తరువాత అక్కడ మొదటి పేరా దగ్గరలో డొనేషన్ కి సంబందించిన ఓ టెక్స్ట్ మెసేజ్ కనబడుతుంది.
5.దాన్ని చదవడం ద్వారా మనకి ఎలా డొనేట్ చేయాలో అర్ధం అవుతుంది.అక్కడ మినిమం 50/- నుండి 5000/-, అంతకంటే ఎక్కువ. మీరు యెంత డొనేట్ చేయదలుస్తారో అంత ఈజీగా చేసే వెసులుబాటు కలదు.
కావున మీలో ఎవరన్నా డైలీ వికీపీడియా యూజర్లు ఉంటే దయచేసి డొనేట్ చేయండి.ఎందుకంటే భావితరాలకు వికీపీడియా ఎంతగానో అవసరం అని గుర్తించండి.
గమనిక: కేవలం వికీపీడియా యూజర్లే కాకుండా సామాన్యులు కూడా డొనేట్ చేయవచ్చు.