సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఆవిర్భావ వేడుకలను సూర్యాపేట జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించారు.సుమారు సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న లాడఖ్ ప్రాంతంలోని మౌంటరబుల్ రోడ్ లోని కార్డున్గల పాస్ వద్ద జై తెలంగాణ ప్లకార్ట్ లతో తెలంగాణ వేడుకలను బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కట్కూరి కార్తిక్ రెడ్డి నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల నివాళులు అర్పించేందుకు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ కార్యాక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ పర్యటనలో దేవులపల్లి గౌతమ్, కట్కూరి కపిల్ రెడ్డి,అనుముల వంశీ,శ్రీకాంత్, అంజన్ పాల్గొన్నారు.







