నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.రాబోయే రోజుల్లో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు.
పేపర్ లీక్ లకు ఆస్కారం లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.ఆరు గ్యారెంటీలను వంద శాతం అమలు చేస్తామని తెలిపారు.