యూపీఎస్సీ( UPSC ) నిర్వహించే సివిల్స్ పరీక్షలో సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.యూపీఎస్సీలో సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఎంతో కృషి ఉంటుంది.
యూపీఎస్సీలో సక్సెస్ సాధించిన కొంతమంది కథలు వింటే స్పూర్తి కలగడంతో పాటు కళ్లు చెమ్మగిల్లుతాయి.అలా యూపీఎస్సీ పరీక్షలో టాపర్ గా నిలిచి ప్రశంసలు అందుకుంటున్న వాళ్లలో అపరాజితా రాయ్ ఐపీఎస్ ఒకరు.
సిక్కిం తొలి మహిళా ఐపీఎస్ అయిన అపరాజితా రాయ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.అపరాజితా రాయ్ తండ్రి జ్ఞానేంద్ర రాయ్ సిక్కింలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.8 సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయిన అపరాజితా రాయ్ బాల్యం నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని కలలు కని ఎట్టకేలకు ఆ కలను ఎంతో కష్టపడి నెరవేర్చుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి కావాలని కల కన్న 20 సంవత్సరాల తర్వాత అపరాజితా రాయ్ ఆ కలను నెరవేర్చుకున్నారు.చిన్నప్పటి నుంచి అపరాజితా రాయ్ చదువులో చురుకైన యువతి కాగా 2004 సంవత్సరంలో జరిగిన ఐసీఎస్ బోర్డ్ ఎగ్జామ్( ICS Board Exam ) లో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.పాఠశాల దశలోనే ఆమె ఉత్తమ ఆల్ రౌండర్ స్టూడెంట్ గా ఫౌండర్స్ మెడల్ ను సొంతం చేసుకున్నారు.
యూపీఎస్సీ కోసం 2009 సంవత్సరంలోనే అపరాజితా రాయ్( Aparajita rai ) ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదు.2010 సంవత్సరంలో ఆమె 768వ ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు.2011 సంవత్సరంలో ఆమె 358వ ర్యాంక్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.పశ్చిమ బెంగాల్ కేడర్ కు చెందిన అపరాజితా రాయ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అపరాజితా రాయ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అపరాజితా రాయ్ తన టాలెంట్ తో ఎంతోమందితో ప్రశంసలు అందుకుంటున్నారు.