Rock Salt Kidney Patients: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రకం ఉప్పును ఉపయోగించడం మంచిదా..

చాలామంది ప్రజలు ఆహారం రుచిగా ఉండడం కోసం వంటకాలలో ఎన్నో రకాల పదార్థాలను ఉపయోగిస్తూ ఉంటారు.వాటన్నిటిలో ముఖ్యమైన పదార్థం ఉప్పు.

 Which Type Of Salt Is Good For Kidney Patients Details, Salt, Rock Salt, Kidney-TeluguStop.com

ఆహారం రుచిగా ఉండడానికి ఉప్పు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.ఉప్పు లేకుండా ఏ ఆహార పదార్థం అయినా అసంపూర్ణంగానే ఉంటుంది.

ఉప్పు ఆహారానికి రుచిని, శరీరానికి అయోడిన్ అందిస్తూ ఉంటుంది.అయోడిన్ శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరును నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తెల్ల ఉప్పును అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు.కిడ్నీ రోగులకు ఏ ఉప్పు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీ వ్యాధులతో బాధపడే వ్యాధిగ్రస్తులకు రాళ్ల ఉప్పు మంచిదని ఒక అధ్యయనంలో తెలిసింది.ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు ఉప్పు తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

ఎందుకంటే ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.ఇది కిడ్నీ రోగుల ఆరోగ్యాన్నికి హాని చేసే అవకాశం ఉంది.ఆహారంలో చిటికెడు ఉప్పు అవసరమయ్యే పరిస్థితి ఉంటే సాధారణ ఉప్పుకు బదులుగా రాళ్ల ఉప్పును వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో సోడియం తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఇది కిడ్నీ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.

Telugu Pressue, Tips, Iodine, Kidney, Kidney Salt, Kidney Problems, Manganese, R

ఐరన్, మాంగనీస్ తో రాతి ఉప్పులో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.నిజానికి సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది.ఇది రక్తపోటును పెంచే అవకాశం ఉంది.

ఈ విషయంలో ఈ వ్యాధిగ్రస్తులు తక్కువ సోడియం ఉన్న ఉప్పు ఆహారంలో ఉపయోగించడం మంచిది.కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

తినడం, త్రాగడంలో నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని మలినాలను కిడ్నీలు సక్రమంగా బయటకి పంపలేవు.దీనివల్ల ఈ మలినాలు రక్తంలో చేరడం వల్ల రక్తంలో ఎలక్ట్రోలైట్ స్థాయిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇది శరీరానికి హాని కలిగేలా చేస్తుంది.కాబట్టి కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాళ్ల ఉప్పును ఉపయోగించడం వల్ల వారి కిడ్నీ ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube