నల్లగొండ జిల్లా: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 8,10,13,15 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఇక 6 నుంచి 8 తరగతుల పరీక్షలు ఏప్రిల్ 8,10,13,15, 16,18 తేదీల్లో జరగనున్నాయి.ఒక్క 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.