నల్లగొండ జిల్లా:మాజీమంత్రి జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఆప్రజాస్వామికమని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ,మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు.స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డిపై వేటు హేయమైన చర్య అని,ప్రజాపాలన పేరుతో చేస్తున్న ఆప్రజాస్వామిక పనులను ఖండించి,
రైతుల మహిళల,వృద్ధుల పక్షాన మాట్లాడే నేతపై ఇది సర్కార్ చర్య అని,జగదీష్ రెడ్డి గొంతునొక్కి ప్రభుత్వం ఏదో సాధిఇస్తామంటే అది సర్కార్ పిచ్చి ఆలోచన మాత్రమేనని, తెలంగాణ సమాజమంతా చూస్తుందని,ప్రజాక్షేత్రంలో ప్రతిదానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.