నల్గొండ జిల్లాలో సీఎం నేడు కేసీఆర్ పర్యటన

నల్లగొండ జిల్లా:తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు నకిరేకల్‌లో ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని,నల్గొండలో సాయంత్రం 4 గంటలకు ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరు కానున్నారు.

 Cm Kcr's Visit To Nalgonda District Today , Nalgonda , Cm Kcr, Brs Leaders-TeluguStop.com

ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ నేతలకు ( BRS leaders )బ్రహ్మాస్త్రం లాంటిది.దీన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం పర్యటన షెడ్యూల్‌ ముందస్తుగానే ఖరారు కావడంతో ఆ తేదీలకు రెండురోజుల ముందు గడపగడపకూ ప్రచారాన్ని సైతం పక్కనపెట్టి ఎమ్మెల్యేలు కీలక నేతలు సీఎం సభకు ఏర్పాట్లు జనసమీకరణలో నిమగ్నమయ్యారు.బీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలతో పాటు సాధారణ జనాన్ని సభకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube