నదికొండలో నాయకుల కబ్జాల పర్వం!

నల్లగొండ జిల్లా:నాగర్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన నాయకుల దౌర్జన్యం అంతా ఇంత కాదయా,తలా పాపం తిలా పిడికెడు అన్నట్లుగా సాగుతుందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.అధికార పార్టీ నాయకుల దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని,నందికొండ మున్సిపాలిటీలోని 1వ, వార్డులోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ స్థలాన్ని సైతం విడిచిపెట్టకుండా అమ్ముకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 Nadikonda Nadikonda Nayakabza Festival!-TeluguStop.com

హిల్ కాలనీ ప్రజల దాహార్తి తీర్చే ట్యాంక్ స్థలం అమ్ముకున్నా చూస్తూ ఉండడం తప్పా ఏమి చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారని,వీరికి స్థానిక ఎమ్మెల్యే సహకరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.సామాన్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అక్రమ కట్టడాలను అడ్డుకునే పరిస్థితి లేకపోగా,తిరిగి వారినే బెదిరించి పంపించినట్టు విశ్వాసనీయ సమాచారం.

గతంలో కూడా అక్రమ కట్టడాలను కొన్ని తొలగించినప్పటికీ వాటిని మళ్లీ నిర్మాణం చేపట్టినారని,వాటి పైన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని సత్వర చర్యలు చేపట్టాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయ దిగ్బంధనానికి సైతం వెనకాడమని హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube