నల్లగొండ జిల్లా:స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బి1,బీసీ హాస్టల్స్ లో మహాత్మ జ్యోతిభా పూలే 196 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.అనంతరం హాస్టల్స్ లో నెలకొన్న వసతులను స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో,బీఎస్పీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకెపాక శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సమయంలో అస్తవ్యస్తంగా ఉన్న హాస్టల్ లో రోజు కొంత గోడలు కూలిపోతున్న భవనంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నట్టు విద్యార్థులు విలపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే హాస్టల్ వసతి భవనాన్ని మార్చాలని డబ్ల్యూ హెచ్ ఓ తో మాట్లాడినట్లు తెలిపారు.
విద్యార్థుల పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు.







