సైరన్ తో వచ్చేది పోకిరీలా...పోలీసులా...?

నల్లగొండ జిల్లా: రోడ్డుపై రయ్ రయ్ మంటూ ఓ వెహికిల్ దూసుకుపోతుంది.కుయ్ కుయ్ మంటూ పోలీస్ సైరన్ మోత మోగుతుంది.

 Who Comes With The Siren Hooligan Or Police, Siren, Thieves ,police, Fake Polic-TeluguStop.com

ఎవరో వీవీఐపీ వెహికిల్ అనుకుని వాహనదారులు కంగారుపడి సైడ్ ఇవ్వడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో షరా మామూలుగా మారింది.ఇంకా చెప్పాలంటే పోలీసులు కూడా నిజంగా వీఐపీ వెహికిల్ అనుకొని వదిలేస్తుంటారు.

సీన్ కట్ చేస్తే అది వీవీవీఐ వెహికిల్ కాదు.అందులో ఉన్నది పోలీస్ ఆఫీసరో లేదంటే బడా లీడరో కాదు.

పనీ పాటా లేని ఓ పోరంబోకు అంటే మీరు నమ్మగలరా! వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం.కాస్త రాజకీయ పలుకుబడి,పోలీసులను మేనేజ్ చేసే సత్తా ఉంటే చాలట.

పోలీస్ సైరన్ వేసుకుంటూ రోడ్డుపై రయ్ రయ్ మంటూ పరుగెత్తవచ్చట.

అంతేకాదు బంధువులు, స్నేహితుల వద్ద పెద్ద బిల్డప్ ఇచ్చుకోవచ్చు.

ఎంచక్కా టోల్ ఛార్జీలకు ఎగనామం పెట్టొచ్చు.ఇలా నల్గొండలో కొందరు పోకిరీలు కొన్నాళ్లుగా ఇదే ఫార్ములా ను ఫాలో అవుతున్నారు.

తాజాగా నేరాలను అరికట్టేందుకు,క్రైం రేటును తగ్గించేందుకు పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కొరడా ఝలిపించింది.

కానీ పోలీస్ సైరన్ వైలెట్ చేస్తున్న పోకిరీలపై మాత్రం నిఘా ఎందుకు పెట్టడం లేదన్న ఆరోపణలు సగటు సామాన్యుడి నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.

కొందరైతే నిబంధనలు సామాన్యుడికేనా? పలుకుబడి ఉన్న వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయొచ్చా అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జోక్యం ఉంటుందనే భయంతోనో పెద్దోళ్లతో లొల్లి మాకెందుకనో ఏమో గానీ, నల్గొండలో పోలీస్ సైరన్ వైలెట్ అవుతున్నా ఖాకీల చెవులకు వినిపించడం లేదా అని మట్లాడుకుంటున్నారు.దాంతో ఆవారాగా తిరిగే ప్రతీవోడు సైరన్ తో జల్సా చేస్తున్నాడు.

మరి ఇప్పటికైనా నకిలీ సైరన్ లతో పోలీస్ శాఖ అప్రమత్తమవుతుందో లేదో చూడాలి.సైరన్ లే కదా అని వదిలేస్తే రేపటి రోజు జేబుల్లో వెపన్ లు కూడా పెట్టుకుని తిరుగుతారేమో పోలీస్ సార్లూ బీకేర్ ఫుల్ అంటున్నారు జిల్లా ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube