బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల

నల్లగొండ జిల్లా: దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల/ కళాశాల(బాలికల)ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్ తో కలిసి సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.హాస్టల్ లోని డైనింగ్ హాల్ సందర్శించి మధ్యాహ్న భోజనాల నాణ్యతను పరిశీలించారు.

 Mla Battula Made A Surprise Visit To The Girls Gurukula School, Mla Battula , Su-TeluguStop.com

రోజువారీ భోజన పట్టికలోని పదార్థాలు అన్ని సక్రమంగా వస్తున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

పాఠశాల/కళాశాలలో ని క్లాస్ రూమ్ లో సందర్శించి విద్యార్థులతో మాట్లాడి క్లాస్ రూమ్ లలో ఉన్న సదుపాయాలు విద్యార్థుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.అలాగే విద్యార్థులు ప్రతిఒక్కరూ నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి,వారి విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా మొక్కల యొక్క ప్రాధాన్యత,మిర్యాలగూడ నియోజకవర్గ పర్యావరణం, కాలుష్యంపై విద్యార్థులకు వివరించారు.అలాగే విద్యార్థులకు ఎలాంటి అవసరాలు ఉన్నా నాకు సంప్రదించండి నేను ఏర్పాటు చేస్తాను.

కానీ,మీరు మాత్రం మంచిగా చదువుకొని నేను నా మిర్యాలగూడ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఎదగాలని అన్నారు.అనంతరం పాఠశాల/ కళాశాల హాస్టల్ యాజమాన్యంతో మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలని,మెనూలో ఉన్న ప్రతీ ఒక్కటి వారికి అందించాలని,పోషకాహారం అందించినప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా చదువుకుంటారని, నేను మరోసారి వస్తానని, మరలా ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube