రుణమాఫీ పై స్పష్టత లేదు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: రైతు రుణమాఫీపై స్పష్టత లేదని,గోదావరి నీటి లిఫ్టింగ్ చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని విమర్శించారు.

 No Clarity On Loan Waiver Former Minister Jagadish Reddy, No Clarity ,loan Waive-TeluguStop.com

ఉచిత బస్సుల సంఖ్యను కుదించారని మహిళలు శపిస్తున్నారని, విద్యుత్ అధికారులపై నెపం నెట్టి కరెంట్ కోతల నుండి తప్పించుకోవాలని కాంగ్రెస్ నాయకులు చిల్లరప్రయత్నాలు చేస్తున్నారని,రుణమాఫీ ఒక జోక్ లా కనిపిస్తుందని, మాఫీ వివరాలపై స్పష్టతలేక అన్నదాతలు ఆందోళన పడుతున్నారన్నారు.రుణమాఫీపై వివరాలు అడిగితే అధికారులు గందరగోళానికి గురైతున్నారని,

మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని,కాంగ్రెస్ నాయకులకు దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకువడం లేదని ఆరోపించారు.

వ్యవసాయం,సాగునీరుపై సీఎం సహా ఎవ్వరికీ అవగాహన లేదని,మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా ఎందుకు ఎత్తి పోయడంలేదని, కాళేశ్వరం కాల్వలకు నీటిని ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, కాళేశ్వరం కొట్టుకుపోతదని దుష్ప్రచారం చేశారని,సాగుకు సిద్ధమైన రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.యాసంగిలా ఈసారి కూడా రైతులను ఎండబెడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

గోదావరి ఆయకట్టుకు నీళ్ళందించే అవకాశం ఉన్నా రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని,గోదావరి నీళ్ళు వృధాగా పోనీయకుండా తక్షణమే సాగు,తాగు నీరు అందించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube