గ్రామాలలో రేపటి నుండి పారిశుద్ద్యంపై ప్రత్యేక డ్రైవ్ చేయండి: ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా: మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యంపై రేపటి నుండి ప్రత్యేక డ్రైవ్ చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు,ప్రత్యేక అధికారులతో గ్రామాలలో పారిశుద్ద్య సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Special Drive On Sanitation In Villages From Tomorrow Mla Komatireddy Rajagopal-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎటు చూసినా చెత్తతో నిండి ఉంటుందని, మురుగునీరు నిలువ ఉండడం వల్ల దోమలు ఎక్కువై విష జ్వరాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, గ్రామాలని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ అధికారుల మీద ఉందని గుర్తు చేశారు.

గ్రామాల్లో మొదట పారిశుద్ద్య పనులపైన దృష్టి పెట్టాలని కోరారు.రేపటినుండి గ్రామాల్లో పారిశుద్ద్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని,మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుతామో గ్రామాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శుల పైన ఉందన్నారు.

గ్రామ మధ్యలో నివాసగృహాల మధ్యలో చెత్త వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,ఒకవేళ చెత్త వేసినట్లయితే వాటిని వెంటనే తొలగించి గ్రామాల్లో ఆరోగ్య వాతావరణాన్ని సృష్టించాలని చెప్పారు.గ్రామాల్లో పారిశుద్ధ పనుల పై మరొ 10 రోజులలో మరొక సమావేశం నిర్వహించి,పంచాయతీ కార్యదర్శుల పనితీరును పరిశీలిస్తానన్నారు.

పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పనిచేయలేని వాళ్లు వాలంటరీగా వెళ్లిపోవాలని సున్నితంగా హెచ్చరించారు.పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తానని, బాధ్యతాయుతంగా పనిచేసే కార్యదర్శులకు తమ వంతుగా సహకరిస్తానని చెప్పారు.

మునుగోడు నియోజకవర్గం ఆరోగ్య నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ సమీక్ష సమావేశంలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి, మునుగోడు ప్రత్యేక అధికారి మురళి, మునుగోడు ఎంపీడీవో పూజ,గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube