నియంత పాలన నుండి సూర్యాపేటకు స్వాతంత్ర్యం రాబోతుంది...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రానున్న సాధారణ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి గౌడ్ ప్రకటించారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఎస్పి కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మేల్యే అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ ను కలిసి మద్దతు తెలిపారు.

 Independence Is Coming To Suryapet From Dictatorial Rule Bsp Vatte Janaiah Yadav-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ మరో నెల రోజుల్లో సూర్యాపేట నియోజకవర్గానికి నియంత పాలన నుంచి స్వాతంత్ర్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తే లీకేజీ పేరుతో రద్దు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ ను ప్రతి ఒక్క ఓటరు తన బిడ్డగా గుర్తించి మద్దతు తెలిపి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

డబ్బుల ద్వారా గెలవచ్చని కలలుకంటున్న పార్టీలకు ఓటు రూపంలో తగిన గుణపాఠం నేర్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్ధి సంఘం నేతలు సైదులు,వెంకన్న, మహేష్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube