నల్లగొండ జిల్లా: దామరచర్ల మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు లూటీ చేశారు.విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
సీసీ కెమెరాకు పెప్పర్స్ కొట్టిన ఆనవాళ్లు కనిపించడంతో ఇది పక్కా
ప్రొపెషనల్ దొంగల పనిగా కనిపిస్తుంది.దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు చోరీకి గురైనట్లు సమాచారం.
పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి డాగ్ స్క్వాడ్,క్లూస్ టీమ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండడం వల్ల దామరచర్ల మండల కేంద్రాన్ని పోలీసులు చుట్టుముట్టారు.