నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్( Nagarjuna Sagar ) నియోజకవర్గ అధికార పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుకొని, అసమ్మతి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు గులాబీ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.వారంతాగతవారం రోజులుగా మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి( Kunduru Jana Reddy )తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
గుర్రంపోడ్, రుమలగిరి,త్రిపురారం,అనుముల మండలాల నుండి త్వరలోనే కాంగ్రెస్ లోకి భారీ చేరికలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
గుర్రంపోడ్ జడ్పీటీసీ గాలి సరిత భర్త రవి కుమార్ సుమారు 16 మంది సర్పంచ్ లు,ఇద్దరు ఎంపిటీసీలతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఓ బీఆర్ఎస్( BRS ) మండల నాయకుడు తెలపగా, తిరుమలగిరి ఎంపీపీ భగవాన్ నాయక్, పెద్దవూర ఎంపీపీ అనురాధ భర్త సుందర్ రెడ్డితో పాటు మరికొంత మంది పార్టీ మారే యోచనలో ఉన్నట్టు జోరుగా చర్చ సాగుతోంది.