వర్షంలో కూడా ఆగని పంచాయతీ కార్మికుల సమ్మె

నల్లగొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గంలోని పీఏ పల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికుల 21 వ రోజుకు చేరుకుంది.పారిశుద్ధ్య కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమ్మె చేస్తున్నారు.

 The Strike Of Panchayat Workers That Did Not Stop Even In The Rain, Strike ,panc-TeluguStop.com

తమ యొక్క డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేసి, రెగ్యులర్ చేయాలన్నారు.కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా సమ్మెను విచ్చిన్నం చేయడం కోసం కార్మికులను తొలగించి కొత్తవారిని పెడతామనడం సరైన పద్ధతి కాదని,గత తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తుందని అన్నారు.

కార్మికుల చట్టాలను అమలు చేయకుండా కార్మికులతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులందరికీ ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని,8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని వేతనాల ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీల ద్వారా వేతనాలు పిఆర్సీలు నిర్వహించడం మినిమం బేసిక్ 19 వేల రూపాయల వేతనాలు చెల్లించాలని కారోబార్లను, బిల్ కలెక్టర్లను సహా కార్యదర్శులుగా నియమించాలన్నారు.

విధినిర్మాణ ప్రమాదం జరిగిన మరణించిన కుటుంబానికి 10 లక్షల నష్టం పరిహారం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సహజ మరణానికి 5 లక్షల చెల్లించాలన్నారు.

వీఆర్ఏ లను చేసిన విధంగా మమ్మల్ని కూడా చేయాలని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏసొబ్, సాయి,వినోద్, ఆంజనేయులు,శివ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube