నల్లగొండ జిల్లా:ఆయన ఏది మాట్లాడినా,ఏం చేసినా ఓ సంచలనమే.అటు ఇటు అయినా,ఇటు అటు అయినా ఏదీ ఏమైనా ఆయన రూటే సఫరెట్.
ఆయనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy )మునుగోడు అభివృద్ధికి బాటలు వేస్తూనే రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అంటుంటారు ఆయనను దగ్గరగా చూసినవారు.ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం మరోసారి బీఆర్ఎస్ పార్టీపైన, కేసీఆర్,కేటీఆర్ పైన
హాట్ హాట్ కామెంట్స్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపి స్థానం కూడా దక్కనీయం అన్నారు.అంతటితో ఆగకుండా లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రిటైర్మెంట్ తీసుకోవడం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అమెరికాకు వెళ్ళడం ఖాయమని, అనంతరం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతోందని జోస్యం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పని అయిపోయిందని,ఉనికి కాపాడుకోవడానికి ఆ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కానీ, అదంతా వృథాగా మిగిలిపోనుందని ఎద్దేవా చేశారు.భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.
కేసీఆర్ కుటుంబంపై త్వరలోనే విచారణ జరుపుతామని చెప్పారు.తమది మాటల ప్రభుత్వం కాదని,చేతల ప్రభుత్వమని కీలక వ్యాఖ్యలు చేశారు.