కృష్ణానదిపైన ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజ్ దిగువకు...!

నల్లగొండ జిల్లా: కృష్ణాన( Krishna river )దిపైన ఉన్న ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ కి దిగువకు చేరుకొని,ఎగువ నుండి వచ్చే వరద జలాల కోసం ఎదురుచూస్తున్నాయి.గత ఏడాదిలో ఆంధ్ర,తెలంగాణ సరిహద్దుల్లోని శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు జూలై 7నే తెరిచారు.

 In The Projects On The Krishna River, The Water Is Below The Dead Storage , Kris-TeluguStop.com

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ రిజర్వాయర్ అప్పటికే నిండుకుండలా మారింది.ఈ ఏడాది జులై 20 దాటిన ఇప్పటి వరకూ వరద జాడలేదు.

ఆదివారం ఆల్మట్టికి 70,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు సమాచారం.ఒకసారిగా మనం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తే ఆలమట్టి ప్రాజెక్టులో 129 టీఎంసీలకు గాను 45 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి.

దిగువన నారాయణపూర్ ప్రాజెక్టులో 37 టీఎంసీలకు గాను కేవలం 17 టీఎంసీలే మిగిలాయి.తెలంగాణకు వస్తే జూరాల ప్రాజెక్టులో 9.6 టీఎంసీలకు గాను 3.95 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు ( Srisailam Dam )పూర్తిస్థాయిలో 215 టిఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్నది 33 టీఎంసీలు మాత్రమే.దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీలకు గాను కేవలం 144 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.

ఆ దిగువన ఉన్నా పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలకు గాను 17 టీఎంసీలే ఉన్నాయి.మొత్తం రిజర్వాయర్లలో 262 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా మిగిలాయి.ప్రస్తుతం ప్రాజెక్టులు నిండాలంటే ఆల్మట్టి మొదలుకొని పులిచింతల వరకు 488 టీఎంసీల జలాలు అవసరం ఉన్నది.క్యూసెక్కులల్లో లెక్కగడితే 56,48,112 అవసరం ఉన్నది.

ముంబాయికి వరదలు వస్తే గాని కృష్ణానది వరద ప్రవాహం కొనసాగదు.అదేవిధంగా మహారాష్ట్ర పడమటి కనుమలలో భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులు నిండే అవకాశం కనిపించడం లేదు.

కనీస వర్షపాతం 610 మిల్లీమీటర్లుగా ఉంది.గరిష్టంగా 11మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.ఒక్కోసారి డిసెంబర్ లో కూడా వరదలు వచ్చే అవకాశం లేకపోలేదు.మరో రెండు నెలలు నైరుతి రుతుపవనాలు ఉంటాయి కాబట్టి ప్రాజెక్టులు నిండుతాయని ఆశిస్తున్నారు.

ఇప్పటివరకు జల ప్రవాహాల జాడలేదు.తుంగభద్ర కూడా పరిస్థితి అంతంత మాత్రమే ఉంది.105 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగభద్ర ప్రాజెక్టు( Tungabhadra ) కేవలం16 టీఎంసీలు మాత్రమే నిల్వలు ఉన్నాయి.తుంగభద్ర నిండితే అది జూరాల దిగువన కలుస్తూ శ్రీశైలానికి చేరుకుంటుంది.

వాతావరణ పరిస్థితిని బట్టి వరద ప్రవాహం ప్రారంభం కావచ్చని ఆలమట్టికి వస్తున్న జలాలు వల్ల ఆశలు కల్పిస్తున్నాయి.వరుసగా ప్రాజెక్టులు నిండితే ఈ ఏడాది ఆలస్యంగానైనా యాసంగి పంటకు ఢోకా ఉండదని భావిస్తున్నారు.2023లో జూన్ లో ప్రారంభం కావలసిన వ్యవసాయ పనులు ప్రస్తుతం అక్కడక్కడ జులై మాసం మధ్యంతరంలో చినుకులు పడ్డ దగ్గర వ్యవసాయ పనులు పుంజుకున్నాయి.నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు కిందరైతులు సాగర్ జలాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube