యాదాద్రి జిల్లా:భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎన్.ఎస్.
యూ.ఐ యాదాద్రి భువనగిరి జిల్లా అద్యక్షులు మంగ ప్రవీణ్ డిమాండ్ చేశారు.మంగళవారం భువనగిరిలో అంబేడ్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లడాతూ తెలంగాణా ముఖ్యమంత్రికి దళితుల పట్ల,బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే అసెంబ్లీలో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి దళితులకు ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవి,3 ఎకరాల భూమి,125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ప్రతిసారి ఎన్నికల ముందు వాగ్ధానాలు చేయడం, వాటిని అమలు చేయకపోవడం పరిపాటి అయ్యిందన్నారు.రాష్ట్రంలో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితికి ఎన్.ఎస్.యూ.ఐ.సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు.ఈ జ్ఞానమాల (66)కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి (CAPSS)జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్,జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్,భానోతు రాజేష్ నాయక్,సలావుద్ధీన్, సాల్వేరు ఉపేందర్,గుగులోతు దూప్ సింగ్,కుర్షీద్ పాషా,సురుపంగ చందు,తదితరులు పాల్గొన్నారు.