నల్లగొండ జిల్లా:దమ్ముంటే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో నాపై పోటీ చేసి గెలవాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కి సవాల్ విసిరారు.గురువారం మునుగోడు మండల పరిధిలోని గూడపూర్, కొరటికల్,చీకటిమామిడి,కొంపెల్లి,మునుగోడు గ్రామాలలో ఆయన పర్యటించారు.
అనంతరం కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని,ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కేసీఆర్ వివక్షత చూపాడని,తెలంగాణ కేసీఆర్ కుటుంబ జాగిరా అని ప్రశ్నించారు.ఈ ఉప ఎన్నిక ఎనిమిదిన్నర సంవత్సరాల సీఎం కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా జరిగే ఎన్నికన్నారు.18 నెలలు ఎమ్మెల్యే పదవికి అవకాశం ఉన్నా,తన రాజీనామాతో నైనా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి రాజీనామా చేశానని,తన రాజీనామాతోనే కేసీఆర్‌కు కనువిపయ్యి ఫామ్ హౌస్‌లో ఉండే కేసీఆర్ మునుగోడుకు వచ్చాడని,10 లక్షల మందికి పెన్షన్, మూడో విడత గొర్లు,చేనేత కార్మికులకు భీమా అమలు చేశాడన్నారు.ఇటీవల జరిగిన కేసీఆర్ సభలో అభ్యర్థిని ప్రకటించకపోవడం ఇక్కడి ప్రజలు అంటే కేసీఆర్ కి భయమన్నారు.
మునుగోడు ప్రజల తీర్పుపై ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని,దీనితో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలన్నారు.టీఆర్ఎస్‌కు పోయిన సర్పంచులు అక్కడ ఇమడలేక తన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో బీజేపీ పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్,బీజేపీ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి సురేందర్ రెడ్డి,బుర్రి శ్రీనివాస్ రెడ్డి,డీసీసీబీ డైరెక్టర్,మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి,జిల్లా నాయకులు దర్శనం వేణు కుమార్,మందుల బీరప్ప,అయితగోని యాదయ్య గౌడ్,కేవీ ఉదయకృష్ణ,బండారు యాదయ్య,గుజ్జ కృష్ణ,కంభంపాటి నరసింహ,శేఖర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.