నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద 65వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృత్యువాత పడగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.కాగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.