తక్కువ ధరకే మొత్తం రైలు బోగీని ఎలా బుక్ చేసుకోవాలి.. ఈ టిప్స్ మీకోసమే..

మీరు రైలులో ఎక్కువ మంది వ్యక్తులతో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే, సౌలభ్యం, సౌకర్యం కోసం మొత్తం కోచ్‌ని( Railway Coach ) లేదా మొత్తం రైలును కూడా బుక్ చేసుకోవచ్చు.భారతీయ రైల్వేలు అందించే ఫుల్ టారిఫ్ రేట్(FTR) సర్వీస్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.ఈ సేవను ఎలా ఉపయోగించవచ్చో, ఖర్చులు, షరతులు ఏమిటో తెలుసుకుందాం.

 How To Book An Entire Train Or Coach Details, Indian Trains, Indian Railway, Rai-TeluguStop.com

1.FTR వెబ్‌సైట్‌ https://www.ftr.irctc.co.in/ftrను విజిట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.లాగిన్ చేయడానికి ప్రత్యేకమైన ID, పాస్‌వర్డ్‌ను పొందాక, ID, పాస్‌వర్డ్‌తో FTR వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.మీ అవసరానికి అనుగుణంగా కోచ్ లేదా రైలును బుక్ చేసుకునే ఎంపికను ఎంచుకోవాలి.

Telugu Train, Entire Coach, Entire Train, Ftr, Full Tarriff, Indian Railway, Ind

2.తేదీ, ఎంట్రీ పాయింట్, డెస్టినేషన్, కోచ్‌ల సంఖ్య, కోచ్‌ల రకం మొదలైన మీ ప్రయాణ వివరాలను ఎంటర్ చేయాలి.మీరు AC ఫస్ట్ క్లాస్,( AC First Class ) AC 2 టైర్,( AC 2 Tier ) AC 3 టైర్, AC కమ్ 3 టైర్, AC చైర్ కార్, స్లీపర్, మొదలైన వివిధ రకాల కోచ్‌ల నుంచి ఎంచుకోవచ్చు.

3.అన్ని వివరాలను ఎంటర్ చేసినాక, పేమెంట్ గేట్‌వే ద్వారా మనీ చెల్లించాలి.చెల్లింపు చేయడానికి ముందు నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవాలి.

Telugu Train, Entire Coach, Entire Train, Ftr, Full Tarriff, Indian Railway, Ind

మొత్తం కోచ్ లేదా రైలు బుకింగ్ ఖర్చు ఎంచుకునే రకం, కోచ్‌ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.ఒక్కో రకమైన కోచ్‌కి చెల్లించాల్సిన రుసుమును రైల్వేలు నిర్ణయించాయి.సాధారణంగా ఒక కోచ్‌ను రిజర్వ్ చేసుకోవడానికి రూ.50,000, రైలు బుకింగ్ కోసం రూ.9 లక్షలు చెల్లించాలి.ఫీజుతో పాటు, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాలి.FTR సేవ సాధారణ ధరతో పోలిస్తే మొత్తం ధరపై 30 నుండి 35 శాతం అదనంగా వసూలు చేస్తుంది.

ప్రయాణ తేదీకి 30 రోజుల నుండి 6 నెలల ముందు వరకు మొత్తం కోచ్ లేదా రైలును బుక్ చేసుకోవచ్చు.ప్రయాణం వాయిదా వేయబడినా లేదా రద్దు చేయబడినా, మీరు మీ బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చు.

రద్దు విధానం ప్రకారం వాపసు పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube