ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపుల్లో నిజాయితీగా వుండాలి: అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్

నల్లగొండ జిల్లా:నల్లగొండ, ఖమ్మం,వరంగల్ శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్( Additional Collector J Srinivas ) అన్నారు.

 Mlc Should Be Honest In By-election Calculations: Additional Collector J. Sriniv-TeluguStop.com

గురువారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్( Nalgonda District Collectorate ) లోని ఉదయాదిత్య భవన్ లో శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు,కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పాటించాల్సిన నియమాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఓట్ల లెక్కింపులో సిబ్బంది షెడ్యూలు సమయం కంటే ముందే రావాలని, సమయానికి రిపోర్ట్ చేయాలని,సెల్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు.

ప్రాథమిక లెక్కింపులో చెల్లిన ఓట్లు చెల్లని ఓట్ల వర్గీకరణలో పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు.మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే పాటించే ఎలిమినేషన్ ప్రక్రియపై సూచనలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube