వాకపల్లి బాధిత మహిళలకు న్యాయం జరిగేదాకా పోరాడుదాం...!

నల్లగొండ, జిల్లా:వాకపల్లి కేసులో దోషులను రక్షిస్తూ వచ్చిన కోర్టు తీర్పులో ద్వంద్వ వైఖరిని ఖండిద్దామని ప్రజా సంఘాలకు ప్రజాభ్యుదయవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న విజ్ఞప్తి లేఖ రాశారు.ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

 Let's Fight Till Justice Is Done For The Victims Of Vakapalli Case , Vakapalli C-TeluguStop.com

వారు నేరం చేయలేదు కాబట్టి నిర్దోషులు కాదు.సరైన సాక్షాధారాలు లేని కారణంగా నిర్దోషులు అన్న రీతిలో కోర్టులు వ్యాఖ్యానిస్తూ గ్రేహోడ్స్ పోలీసులను రక్షించిందనిబాధితుల బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లూరి సీతారామరాజు నియోజకవర్గంలోని జి.మాడుగుల మండలం నర్మతి పంచాయతీ పరిధిలో వాకపల్లి గ్రామం.నర్మతి నుండి ఐదు కిలోమీటర్లు రోడ్డు మీద ప్రయాణం చేసి రెండు కిలోమీటర్లు కాలినడకన వాకపల్లి వెళ్ళాలి.విశాఖ పట్నం నుండి 190 కిలోమీటర్లు దూరంలో వాకపల్లి గ్రామం ఉంది.ఆదివాసీలకు చెందిన 59 కుటుంబాలు వాకపల్లిలో పోడు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు.20.08.2007 తేదీన మగవారు వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో పొలం పనులకు వెళ్లిన సమయంలో 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు గ్రామంపై విరుచుకుపడ్డారు.

మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ బూతులు తిడుతూ, దౌర్జన్యంగా ఇళ్లల్లో దూరి వంటగదిలో ఉన్న మహిళలపై అత్యాచారం చేశారు.ఈ హఠాత్పరిమానానికి భయపడి పారిపోతున్న వాళ్లను,బహిర్భుమికి వెళ్లిన వాళ్లను,పచ్చి బాలింతలని కూడా చూడకుండా అత్యాచారం చేశారు.

మహిలందరిపై సామూహిక అత్యాచారo చేశారు.వీరిలో మూడు రోజుల క్రితం జన్మనిచ్చిన పచ్చి బాలింతరాలైన మహిళ కూడా ఉంది.

ఈ సంఘటన తీవ్ర దుమారం లేపింది.పత్రికా విలేకరులు, మహిళా సంఘాలు,ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందించి బాధితుల పక్షం నిలబడి బాధితులతో పాటు అధికారులకు ఫిర్యాదులు చేయడం జరిగింది.

వాకపల్లి ఆదివాసీలపై జరిగిన అత్యాచార సంఘటన విషయం టీవీల ద్వారా బయట ప్రపంచానికి తెలిసిన వెంటనే అప్పటి రాష్ట్ర డిజిపి బాసిత్ బాధితులు పట్ల చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది.అప్పటి హోంమంత్రి జానారెడ్డి గిరిజన మహిళలపై అత్యాచారం జరగలేదని,అవాస్తవమని ప్రకటించారు.

అప్పటి విశాఖ జిల్లా ఎస్పీ అంజన్ కుమార్ సబర్వాల్ ఇది మావోయిస్టుల నీచ ఎత్తుగడని అభివర్ణించారు.

అప్పటి పాడేరు డిఎస్పి స్టాలిన్ మరీ దిగజారి అమాయక గిరిజన మహిళల మానాలను అడ్డుపెట్టుకొని మావోయిస్టులు మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రచారం చేశారు.

నిజానికి ఈ సమాజంలోని ఏ స్త్రీ తనపై అత్యాచారం జరిగిందని,జరిగినా చెప్పుకోలేని పరిస్థితి ఉంది.అందులోనూ ఆదివాసి సంస్కృతిలో అబద్ధం ఆడడం అనేది ఉండదు.

అలాంటిది ఆనాటి ఈ సంఘటనలో సరియైన విచారణ లేకుండా,సాక్షాధారాలు లేకుండా చేసి,గ్రేహౌండ్ పోలీసులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసింది.కనీసం పోలీసులను చట్టబద్ధంగా అరెస్టులు చేసి విచారణ కూడా చేయకుండా, సమాచార హక్కు చట్టం కింద వాకపల్లి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులు వివరాలు కోరిన వెంటనే ఇవ్వలేదు.

కనీసం సంఘటన జరిగినా వెంటనే కలెక్టర్ గానీ,ఏ ఇతర అధికారులు గానీ, స్థానిక పోలీసులు ఎవ్వరూ కూడా వాకపల్లి వెళ్లి స్థానికంగా జరిగిన సంఘటనపై ప్రాథమిక దర్యాప్తు కూడా జరపలేదు.నేటికీ ఈ సంఘటన జరిగి 16 సంవత్సరాలు తరువాత బాధితులు చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ కేసులో విచారణ సరిగ్గా జరగలేదని,దర్యాప్తు అధికారుల తీరు పట్ల ఆధారాలు లభించని కారణంగా పోలీసులను విడిచి పెడుతున్నామని కోర్టు దోషులపై కేసు కొట్టి వేసింది.

పైగా ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో చెప్పడం జరిగింది.ఈ మొత్తం సంఘటనలో మొదటి నుండి ప్రభుత్వంలో పని చేస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులను శతవిధాలా రక్షించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే వచ్చింది.

మహిళలు అందులోనూ అమాయకులైన ఆదివాసీ మహిళలనే కనీస మానవత్వం ఎక్కడా చూపించలేదు.అత్యాచార మహిళలపై కనీస చట్టరీత్యా ఇవ్వవలసిన సాంఘిక,సామాజిక,ఆర్ధిక భద్రత కూడా ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు.

కోర్టు తీర్పు ఒక బాధాకరం.అత్యాచార బాధితులకు కోర్టులు అభద్రతాభావం నుండి భద్రత గల భావాన్ని కల్పించాలి.

బాధితులు మొదటి నుండి వద్దు అనుకుంటున్నా నష్టపరిహారాన్ని తీర్పులో ఇవ్వాలని ప్రకటిస్తూ… బాధితులు కోరుకున్న దోషులకు శిక్షలు వేయకుండా నిర్దోషులుగా వదిలిపెట్టింది.

ఈ తీర్పు వలన కోర్టులు నిందితుల పక్షం వహించిందని స్పష్టంగా అర్థమవుతుందనిబాధితులు కోరుకున్న న్యాయం జరగలేదని, అమాయక ఆదివాసి వాకపల్లి మహిళా బాధితులకు న్యాయం జరిగే వరకూ ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఆదివాసి బిడ్డలకూ అండగా నిలవాలని బాధితుల బంధువు, బహుజననేస్తం,ప్రజాతంత్ర ఉద్యమకారుడు, సంఘసంస్కర్త, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎంఎల్ )సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న అణగారిన కులాల,వర్గాల, విద్యార్థి,యువజన,మహిళ,కార్మిక,కర్షక అన్ని రకాల ప్రజాస్వామిక ప్రజా సంఘాలకు,మేధావులకు, రచయితలకు,కవులకు, కళాకారులకు,ప్రజల పక్షం వహించాలి అనుకునే ప్రతిపక్ష పార్టీలకు, ప్రజాప్రతినిధులకు బాధితుల బంధువు కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపునిచ్చారు.వాకపల్లి గిరిజన మహిళలకు న్యాయం జరగాలంటే ఈ క్రింది డిమాండ్ల పరిష్కార సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలని ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రజాసంఘాలకు విజ్ఞప్తి చేశారు.

డిమాండ్స్:

1.అత్యాచారం చేసిన గ్రేహౌండ్స్ పోలీసులను శిక్షించాలి.2.వాకపల్లి ఆదివాసి అత్యాచార మహిళల కేసులో సరిగ్గా దర్యాప్తు జరపని అధికారుల శివానంద రెడ్డి, ఆనందరావుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీర్పులో స్పష్టం చేయాలి.3.వాకపల్లి ఆదివాసి మహిళల అభిప్రాయాలను మరొకసారి తీసుకొని, ప్రభుత్వం వేసిన నాగిరెడ్డి కమిషన్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకొని పునర్విచారణ జరపాలి.4.మరణించిన ఆదివాసి మహిళల కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలి.5.వాకపల్లి అత్యాచార బాధితుల కేసు తీర్పు రావడానికి 16 సంవత్సరాలు పట్టింది.ఇలాంటి తాత్సారం వలన కోర్టులపై వున్న నమ్మకం, బాధ్యులు చట్టంలో వున్న లొసుగులు వలన తప్పించుకునే ప్రమాదము వున్నాయి కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సరైన విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube