నల్లగొండ జిల్లా:కొండమల్లేపల్లి సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కేసులు 42 కు చేరాయి.పాఠశాలలో గురువారం కూడా 100 మంది విద్యార్థినులకు కరోనా పరీక్షలు చేయగా అందులో 13 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
నిన్న 29 ఈరోజు 13 మొత్తం 42 కరోనా పాజీటీవ్ కేసులు నమోదయ్యాయి.ఈరోజు కరోనా పాజీటీవ్ నిర్ధారణ అయిన 13 మంది విద్యార్థినులను పాఠశాలలోనే క్వారైంటైన్ లో ఉంచి మెడిసిన్ కిట్ ఇచ్చి చికిత్స అందిస్తున్నారు.
పరిస్థితి చూస్తుంటే పాజిటివ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.